నా జన్మభూమి కెనడా కానీ, నా కల్చర్‌ తమిళ్‌: నటి

Maitreyi Ramakrishnan Life Journey - Sakshi

గ్లామర్‌ ప్రపంచంలో  తెలుపు రంగుకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆ కాంప్లెక్షన్‌ను ప్రతిభతో సరిచేసిన నటీమణులెందరో! ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది∙ ఇండియన్‌ కెనడియన్‌ నటి మైత్రేయి రామకృష్ణన్‌. 

పుట్టింది, పెరిగింది, చదివింది కెనడాలోనే. తల్లిదండ్రులు రామ్‌ సెల్వరాజ్, కృతిక సెల్వరాజ్‌. శ్రీలంక సివిల్‌ వార్‌ సమయంలో తమిళనాడు నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు.  

మార్వల్, డిస్నీ స్టోరీస్‌ అంటే ఒళ్లంతా చెవులు చేసుకునేది మైత్రేయి. ఆ ఆసక్తితోనే  పెద్దయ్యాక యానిమేటర్‌ కావాలని నిర్ణయించుకుంది. కానీ, స్కూల్‌ నాటకాల్లో భాగస్వామ్యం ఆమెను నటనవైపు లాక్కెళ్లింది. అందుకే చదువు పూర్తవగానే అభినయ దిశగా అడుగులేసింది. 

మొదటి అవకాశంతోనే సత్తా చాటింది. సుమారు పదిహేను వేల మంది హాజరైన ఆడిషన్‌లో తను మాత్రమే ఎంపికై ‘నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌’లో ప్రధాన భూమిక పోషించింది. ‘దేవి’గా అద్భుతంగా నటించి పలు అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది.

పియానో వాయించడం, స్నేహితులతో  షాపింగ్‌ చేయటం, పెంపుడు జంతువులతో ఆడుకోవడమంటే ఇష్టం.

భరత నాట్యం, కథక్‌లో శిక్షణ తీసుకుంది. కొంతకాలం థియేటర్‌ ఆర్టిస్ట్‌గానూ  పనిచేసింది. 

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే మైత్రేయి పలు సామాజిక పోరాటాల్లో పాల్గొంది. అందుకే ‘ఎయిటీన్‌ గ్రౌండ్‌ బేకర్స్‌’లో ఆమె పేరు చేరింది. 

నా జన్మభూమి కెనడా. కానీ నా కల్చర్‌ తమిళ్‌. ఈ నిజం ఒప్పుకోవడానికి, చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ సంకోచించను. నిజానికి అదే  నా గుర్తింపు’  అంటుంది మైత్రేయి రామకృష్ణన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top