breaking news
Maitreyi Ramakrishnan
-
బ్రేక్ ఔట్ యాక్టర్.. తమిళ అమ్మాయి!
మైత్రేయి రామకృష్ణన్... కెనడాలో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. నెట్‌ఫ్లిక్స్ టీన్ కామెడీ సిరీస్ ‘నెవర్ హ్యావ్ ఐ ఎవర్’లో లీడ్‌రోల్ కోసం పదిహేను వేలమంది పోటీ పడ్డారు, అందులో నుంచి మైత్రేయిని ఎంపిక చేశారు. ‘దేవి విశ్వకుమార్’ పాత్ర ఆమెకు మాంచి పేరు తీసుకువచ్చింది. హాలివుడ్ సినిమాలకు దారి చూపించింది. (చదవండి: సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి) అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ ‘టర్నింగ్ రెడ్’లో నటించింది. ఈ సినిమా విడుదలైతే... హాలివుడ్లో అవకాశాల జోరు పెరుగుతుంది. ‘బ్రేక్ ఔట్ యాక్టర్’గా ‘టైమ్–100’ ఇన్ఫ్లూయెన్షల్ పీపుల్–2021 జాబితాలో మైత్రేయి పేరు చోటుచేసుకుంది. బాలీవుడ్‌లోనూ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. (చదవండి: ‘రాధేశ్యామ్’ సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్, ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి..) -
నా జన్మభూమి కెనడా కానీ, నా కల్చర్ తమిళ్: నటి
గ్లామర్ ప్రపంచంలో తెలుపు రంగుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ కాంప్లెక్షన్ను ప్రతిభతో సరిచేసిన నటీమణులెందరో! ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది∙ ఇండియన్ కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణన్. ►పుట్టింది, పెరిగింది, చదివింది కెనడాలోనే. తల్లిదండ్రులు రామ్ సెల్వరాజ్, కృతిక సెల్వరాజ్. శ్రీలంక సివిల్ వార్ సమయంలో తమిళనాడు నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు. ►మార్వల్, డిస్నీ స్టోరీస్ అంటే ఒళ్లంతా చెవులు చేసుకునేది మైత్రేయి. ఆ ఆసక్తితోనే పెద్దయ్యాక యానిమేటర్ కావాలని నిర్ణయించుకుంది. కానీ, స్కూల్ నాటకాల్లో భాగస్వామ్యం ఆమెను నటనవైపు లాక్కెళ్లింది. అందుకే చదువు పూర్తవగానే అభినయ దిశగా అడుగులేసింది. ►మొదటి అవకాశంతోనే సత్తా చాటింది. సుమారు పదిహేను వేల మంది హాజరైన ఆడిషన్లో తను మాత్రమే ఎంపికై ‘నెవర్ హావ్ ఐ ఎవర్’లో ప్రధాన భూమిక పోషించింది. ‘దేవి’గా అద్భుతంగా నటించి పలు అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. ►పియానో వాయించడం, స్నేహితులతో షాపింగ్ చేయటం, పెంపుడు జంతువులతో ఆడుకోవడమంటే ఇష్టం. ►భరత నాట్యం, కథక్‌లో శిక్షణ తీసుకుంది. కొంతకాలం థియేటర్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసింది. ►సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మైత్రేయి పలు సామాజిక పోరాటాల్లో పాల్గొంది. అందుకే ‘ఎయిటీన్ గ్రౌండ్ బేకర్స్’లో ఆమె పేరు చేరింది. ►నా జన్మభూమి కెనడా. కానీ నా కల్చర్ తమిళ్. ఈ నిజం ఒప్పుకోవడానికి, చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ సంకోచించను. నిజానికి అదే నా గుర్తింపు’ అంటుంది మైత్రేయి రామకృష్ణన్.