Bollywood Actor Mahie Gill Confirms Secret Wedding to Ravi Kesar - Sakshi
Sakshi News home page

Mahie Gill : నటుడితో సీక్రెట్‌గా రెండో పెళ్లి.. తొలిసారి బయటపెట్టిన హీరోయిన్‌

Apr 18 2023 8:54 PM | Updated on Apr 18 2023 9:23 PM

Mahie Gill Confirms Secret Wedding To Ravi Kesar - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ మహి గిల్‌ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అయిన రవి కేసర్‌ని గతంలోనే పెళ్లి చేసుకున్నట్లు తాజాగా బయటపెట్టింది. అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో తమ వివాహం జరిగిందని పేర్కొంది.

అయితే పెళ్లికి సంబంధించి ఇంతవరకు ఫోటోలు, వీడియోలను మాత్రం రివీల్‌ చేయలేదు. 2019లో మహీ గిల్- రవి కేషర్‌లు ‘ఫిక్సర్’ అనే వెబ్ సీరిస్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. గతంలోనూ వీరి రిలేషన్‌షిప్‌పై వార్తలు వచ్చినా మహీ గిల్‌ స్పందించలేదు. 

తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సీక్రెట్‌ వెడ్డింగ్‌పై తొలాసారి ఓపెన్‌ అయ్యింది. కొంతకాలం క్రితమే రవి కేసర్‌తో తనకు పెళ్లయిందని తెలిపింది. కాగా మహి  గిల్‌కు ఇది రెండో వివాహం. రవి కేసర్‌తో పెళ్లయ్యే నాటికే ఆమెకు  ‘విరోనికా’ అనే కూతురు ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement