మహేశ్‌- రాజమౌళి సినిమా బడ్జెట్‌ రూ. 1000 కోట్లు..! | Who Are The Producers For Mahesh-Rajamouli Upcoming Movie - Sakshi
Sakshi News home page

మహేశ్‌- రాజమౌళి సినిమా బడ్జెట్‌ రూ. 1000 కోట్లు.. నిర్మాతలు ఎవరు?

Published Sun, Jan 21 2024 9:49 AM

Mahesh Babu And Rajamouli Movie Producer Who - Sakshi

తెలుగు సినీ అభిమానులందరూ మహేశ్‌ బాబు- రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేది దర్శకదీరుడు రాజమౌళి కావడంతో ఎంతటి అంచనాలు పెట్టుకున్నా అంతే స్థాయిలో సినిమాను తెరకెక్కాస్తాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో మహేశ్‌ బాబు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఇప్పటికే  ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమంతో షూటింగ్‌ ప్రారంభించనున్నాడు జక్కన్న.

వాస్తవంగా ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ ఉన్నారనే సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం ఆయనకు జక్కన్న- మహేశ్‌ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం రాజమౌళి, మహేశ్‌ మార్కెట్ భారీగా పెరిగినా ఇచ్చిన మాట‌కి కట్టుబ‌డి ఉన్నారు. కానీ అడ్వేంచర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్‌ అవుతుంది. సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో  ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అందులో ప్రముఖంగా దిల్‌ రాజు పేరు బలంగా వినిపిస్తుంది. ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరోవైపు ఓటీటీ దిగ్గజం అయిన నెట్‌ఫ్లిక్స్‌ తొలిసారి ఒక తెలుగు సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇంత వరకు డిజిటల్‌ వరకే ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ మహేశ్‌ సినిమాతో థియేట్రికల్‌ బిజినెస్‌లోకి అడుగు పెట్టేందుకు ప్రతిపాదన పెట్టిందట. MMSB 29 కోసం ఎన్ని వందల కోట్లు అయినా పెట్టేందుకు తాము రెడీగా ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపిందట. కానీ ఈ ప్రాజెక్ట్‌ గురించి అన్ని విషయాలు రాజమౌళి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement