'కల్కి' సీక్వెల్‌లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం | Mahabharat Nitish Bharadwaj Comments On Kalki Prabhas Character | Sakshi
Sakshi News home page

Kalki Prabhas: కృష్ణుడి ముఖం దాచారెందుకు? నేను ఉన్నానుగా!

Jul 7 2024 4:00 PM | Updated on Jul 7 2024 5:33 PM

Mahabharat Nitish Bharadwaj Comments On Kalki Prabhas Character

ఎక్కడ చూసినా ఇప్పుడు 'కల్కి' మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. గత కొన్నాళ్ల నుంచి డల్‌గా ఉన్న బాక్సాఫీస్‌కి ఈ సినిమా మంచి ఊపు తీసుకొచ్చింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు తెలుగు హీరోలు ఇప్పటికే సినిమాని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా మహాభారత్ సీరియల్ లో కృష్ణుడిగా చేసిన నితీశ్ భరద్వాజ్ వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి.

(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?)

ఇంతకీ ఏమన్నారంటే?
'మ్యాడ్ మ్యాక్స్ సినిమాలని దర్శకుడు నాగ్ అశ్విన్ సూర్తిగా తీసుకుని 'కల్కి 2898' తీసినప్పటికీ పురాణాలని లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే నడిపించారు. సెట్టింగులతో ఇది పురాణాలకు సంబంధించిన కథనే అన్నట్లు తెలివిగా తెరకెక్కించారు. ఫిక్షన్, పురాణాలని కలిపి కొత్తగా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. నా అంచనా ప్రకారం సీక్వెల్‌లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది. ఎందుకంటే కర్ణుడికి అశ్వధ్ధామ, కృష్ణుడు కలిసి విముక్తి కలిగించినట్లు పార్ట్ 2లో చూపిస్తారేమో! అయితే కృష్ణుడి ముఖాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను' అని నితీశ్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు.

ఎంత నిజం?
నితీశ్ భరద్వాజ్ చెప్పినట్లు  పార్ట్ 2లో ప్రభాస్ పాత్ర చనిపోకపోవచ్చు. ఎందుకంటే తొలి భాగం చివర్లో అంతలా హైప్ ఇచ్చి ప్రభాస్‌ని కర్ణుడిగా చూపించారు. ఒకవేళ ఇదే పాత్ర గనక రెండో భాగంలో మరణిస్తే అభిమానులు దీన్ని తీసుకోలేకపోవచ్చు. అంటే నితీశ్ భరద్వాజ్ చెప్పినట్లేం ఏం జరగకపోవచ్చు. మరి ఇలాంటి కామెంట్స్ అన్నింటికీ ఎండ్ కార్డ్ పడాలంటే మాత్రం 'కల్కి 2' వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దర్శకుడు తాజాగా మీడియా మీట్‌లో చెప్పిన దానిబట్టి చూస్తే.. మరో రెండు మూడేళ్ల తర్వాత పార్ట్-2 రిలీజ్ కావొచ్చేమో!

(ఇదీ చదవండి: OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్‌ హనీమూన్స్‌' ట్రైలర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement