Bigg Boss: సూసైడ్‌ చేసుకునేలా అవమానిస్తున్నారు..హోస్ట్‌ నాగ్‌పై మాధవీలత షాకింగ్‌ కామెంట్స్‌

Madhavi Latha Shocking Comments On Bigg Boss 5 Telugu Show  - Sakshi

Madhavi Latha Shocking Comments On Bigg Boss: వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి మాధవీలత తాజాగా బిగ్‌బాస్‌ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లోని తాజా పరిస్థితులపై, హోస్ట్‌ నాగార్జునపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని, ఒక మనిషి సూసైడ్‌ చేసుకునే స్థాయిలో బిగ్‌బాస్‌, హోస్ట్‌ నాగార్జున అవమానించారని ఆరోపించింది. ఇలాంటి వాటిపై ఎలాగూ మానవ హక్కులు, ప్రజా సంఘాలు స్పందించవు అని చెబుతూ ఏకిపారేసింది. అదే పని నాగార్జునకు చేస్తే ఎలా ఉంటుంది?  ఒకవేళ అలా చేస్తే మరుసటి రోజు 100 శాతం గాయబ్ అవుతాడు అంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. 

‘మన గత కాలంలో పల్లెటూర్లలో శిక్షలు ఉండేవి. తప్పు చేసిన వాడికి సగం మీసం లేదా అరగుండు లేదా గుండు కొట్టి సున్నం బొట్టు పెట్టి గాడిద మీద ఉరేగింపు, రాత్రి కటిక నేలమీద నిద్ర, ఊరంతా నువ్ తప్పు చేసావ్ అని తెలిసేలా మెడలో ఒక బోర్డు అలాంటి శిక్షలు ఉండేవి. సున్నిత మనస్కులు తర్వాత అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకునేవారు.

ఇలాంటి కఠిన విష సంసృతి వద్దు అని, మనుషులం మనం మృగాళ్లలా ఉండొద్దు అని మనల్ని మనం మార్చుకుంటూ వచ్చాం. కానీ బిగ్ బాస్ టీంలో ఇప్పటికీ అలాంటి విషపు ఆలోచనలతో ఉన్నవారినే టీంగా తీసుకోవడం, ఒక సైకో మనస్తత్వం ఉన్నవారికి రచన అవకాశం ఇవ్వడం అనేది ఎంతటి దుర్మార్గం. ఈ నాగరిక సమాజంలో అన్ని భాషల్లో ఇలాంటి పనికిమాలిన పద్ధతులు, మనుషులని కించపరచడం.. దానికి బిగ్ బాస్ హౌస్ ఒక దేవాలయం ఇక్కడ జ్ఞానం వస్తుంది అన్నట్లు డబ్బా కొట్టడం.. తప్పుని నిలదీయలేని ఒక హోస్ట్ విషపు ఆలోచనలకి బాటలు వేయడం చూస్తున్న పిల్లలు.

సహజంగా సైకో మెంటాలిటీ ఉన్నవాళ్లు సమాజంలో 70% ఉన్నారు. వాళ్ళు ఇదే సరి అయినది అన్నట్లు ఉంటున్నారు. ఇలాంటి అనాగరికపు చర్యలకి దిగజారుతున్న టీవీ షో కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్న ప్రజలు దాని సంబంధిత మినిస్ట్రీ, సెన్సార్. నాకు బిగ్ బాస్‌పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని మళ్ళీ చెబుతున్నా. కానీ దేవుడి దయవలన డబ్బు వస్తే ఆ ఛానల్‌ని కొని ఆ షోకి నేనే హోస్ట్‌గా వెళ్లి రోస్ట్ చేస్తాను. లేదా ఆ మినిస్ట్రీ మీద నాకు పగ్గాలు వస్తే ఇలాంటి షోని పద్ధతి లేకుండా అనాగరికపు వ్యవస్థకి పట్టం గడుతున్న యాజమాన్యం మరియు హోస్ట్‌కి 100 కోట్ల జరిమానా వేయిస్తాను.

సమాజానికి ప్రజలు మర్చిపోయిన అనాకారిక పద్ధతులని భారత దేశం అంతటా బ్యాన్ చేయాలి. ఇది చూస్తూ నోరు మూసుకున్న సామజిక కార్యకర్తలు, టీవీ చానెల్స్ స్పందించాలి. సమంత విడాకులు విషయం ప్రపంచ వింతలా టెలికాస్ట్ చేసిన చానెల్స్, రెచ్చిపోయిన విలేకరులు ఇలాంటి సభ్య సమాజం అస్యహించుకునే అనాకారిక చర్యల మీద మీరు మాట్లాడారా? దైర్యం లేదా? లేక భయమా? లేక మాకెందుకు అనే నిర్లక్షమా?

ఎవరైనా మనిషే.. ఒక మనిషిని శిక్షించడానికి మీకు హక్కు లేదు. కేవలం మందలించడం మాత్రమే.. జైలు అంటున్నారు సమంజసం. మెడలో బోర్డులు తగిలించి మానసిక హింసకి గురి చేసిన యాజమాన్యం యొక్క మానసిక స్థితిగతులు ఏంటి? అలాంటి స్క్రిప్ట్ రాసిన వాడి యొక్క రాక్షస ఆలోచనల వలన సమాజం విషం కక్కుతోంది అనే విషయం మరిచారా? భారత దేశంలో బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి ఇలాంటి శిక్ష అనుభవించిన వారి మానసిక వేదన ఎలాంటిది?

అప్పట్లో అది ఒక ఊరి ప్రజలకి పరిమితం.. అయినా పరువు కోసం ప్రాణాలు తీసుకునేవారు, మరి ప్రపంచం అంత చూస్తున్న ఒక టీవీ షో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇది చూసి రేపు సరదాలకు సంతోషాలకి ఓడిపోయిన వారికీ ఇలాంటి బోర్డు తగిలించి న్యూ చాలెంజ్ అని ఒక సామజిక దురాచారాలకు తెర లేపుతున్నారు. ఇపుడు మీకోసం ఒక వీరేశలింగం గారు, ఒక రామ్మోహన రాయ్ గారు రాలేరు. దయచేసి ఆపేయండి.. ఇప్పటికే సామాజిక అసమానతల వలెనే ప్రజలు కొట్టుకుంటున్నారు.పిల్లలు ,పెద్దలు ,సైకో మనసు ఉన్నవారికి ఇలాంటివి బాగా నచ్చిచేయడం మొదలు పెడతారు.

చదువుకుని జ్ఞానం ఉన్న మనుషులుగా సమాజంలో ఉంటూ పూర్వకాలం నాటి పనికిమాలిన చర్యలని చూపిస్తూ మురిసిపోతున్న టీం. మరియు హోస్ట్ తన బాధ్యతను విస్మరించారని అనాలనిపిస్తుంది మీ సంస్కారానికి. కానీ, నాకు సంస్కారం ఉంది కనుక అనను. ఇది ఇలాగే కొనసాగుతే న్యాయస్థానం ద్వారా మీ చర్యలకి అడ్డు కట్ట వేయించేలా చేస్తాను. రోజూ సమాజంలో ఇప్పటికి జతుగున్న ఎన్నో చర్యలు చూసి బాధగా ఉంటుంది. కానీ చదువుకుని జ్ఞానం ఉన్న మీరు టీవీ షో ద్వారా ఇలా చేయడం బాధగా ఉంది. శత్రువుని సైతం క్షమించే నేల మనది. సరదాకి టీవీ పెడితే సైకిక్ నేచర్‌ని సమర్థిస్తున్నారు. చాలా తప్పు ఇది’ అని మాధవీలత మండిపడింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top