శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అండ్‌ టీం

MAA Elections 2021: Manchu Vishnu Visit Tirumala Tirupati With His Team - Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు తన టీంతో కలిసి నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. తన తండ్రి మోహన్‌ బాబు, ‘మా’ నూతన కార్యవర్గంతో కలిసి విష్ణు సోమవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని వీఐపీ దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ‘మా’ నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మంచు విష్ణుతో పాటు శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు.

చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి

ఈ సందర్భంగా మోహన్‌ బాబు మంచు మీడియాతో మాట్లాడుతూ.. విష్ణు ‘మా’కు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదని, అది ఓ బాధ్యత... గౌరవ ప్రధమైన హోదా అన్నారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల అనంతరం స్వామివారిని దర్శించుకన్నామని, అందరి కృషి వల్లే మేము గెలిచామన్నారు. మెజారిటీ సభ్యులు తమ ప్యానల్‌ నుంచే గెలిచారని తెలిపారు. ఇక ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ రాజీనామాలపై విష్ణు స్పందిస్తూ.. మీడియా ద్వారానే రాజీనామా చేస్తారని విన్నామని, వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదన్నారు. రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తానని చెప్పారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top