నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?: జీవితా రాజశేఖర్

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీవితా రాజశేఖర్ మరోసారి నరేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 'మా' ఎన్నికల్లో నరేష్ మాటల్ని నమ్మి తప్పుచేశాం అని, ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగలేదని పేర్కొన్నారు. తప్పులు చేయడం సహజమని, వాటిని సరిదిద్దుకున్నామన్నారు. ఎవరు ఏ ప్యానెల్‌లో ఉంటారన్నది వాళ్ల ఇష్టమన్న జీవిత.. మా ఎన్నికలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలన్నారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మద్దతుపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
'బండ్ల గణేష్ నాపై ఆరోపణలు చేశారు కాబట్టే ఆయన గురించి మాట్లాడాను. పృథ్వీ కూడా నాపై ఆరోపణలు చేశారు. ఎందుకు జీవితా రాజశేఖర్‌ను టార్గెట్ చేశారు?పృథ్వీ చేసిన ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నరేష్ అందరిని కలుపుకొని ముందుకు పోనందుకే విబేధాలు వచ్చాయి. నరేష్‌తో ఎందుకు విభేదాలు వచ్చాయో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను' అని జీవిత పేర్కొన్నారు. చదవండి: మా ఎన్నికలు: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు
మరిన్ని వార్తలు