పెద్ది ఐటమ్ సాంగ్.. 50 రోజులు కష్టపడ్డాం..! | Lyricist ananth Sriram Reveals shocking Behind the peddi Item Song | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది ఐటమ్ సాంగ్.. 50 రోజులు కష్టపడ్డాం..!

May 22 2026 3:22 PM | Updated on May 22 2026 3:59 PM

Lyricist ananth Sriram Reveals shocking Behind the peddi Item Song

రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ కూడా ఉంది. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. చెర్రీ సరసన కనిపించనుంది. తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు.

తాజాగా ఈ పాటకు సంబంధించి గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం 50 రోజులు కష్టపడ్డానని అన్నారు. ఈ పాటలోని ప్రతి పదం అర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఆర్ రెహమాన్ బాణీలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. ఆయన బాణీలను అర్థం చేసుకోవడానికే కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫుల్ సాంగ్ మే 23న విడుదల కానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement