
90s మిడిల్ క్లాస్ బయోపిక్తో ఫేమ్ తెచ్చుకున్న యువకుడు మౌళి తనూజ్ ప్రశాంత్(Mouli Tanuj Prasanth). ప్రస్తుతం ఆ యువకుడే ఏకంగా లీడ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు. తాను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే నెల 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించనుంది.
తాజాగా ఈ సినిమా నుంచి రాజగాడికి అనే సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మౌళి తనూజ్ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు హీరోనా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారా? అన్న ప్రశ్న ఎదురైంది.
మౌళీ తనూజ్ మాట్లాడుతూ..' నువ్వు హీరోనా అని అన్నారు. నేను లీడ్ రోల్‌లో చేస్తున్నా అని రెండేళ్ల క్రితం మా అమ్మకు చెప్తేనే నవ్వింది. మూడేళ్ల క్రితం వీడు హీరోగా చేస్తాడా అనుకుంటారు. ఎందుకు ఒక్కోసారి నేను అనుకుంటా. ఇంటర్ చదివేటప్పుడు విష్ణు, నేను కలిసి మీమ్స్ చేసేవాళ్లం. మూవీ ప్రమోషన్స్ వస్తే వారానికి వంద రూపాయలు వచ్చేవి. అవే మాకు చాలా ఎక్కువ. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, మీమ్స్, రీల్స్ చేస్తూ ఈరోజు ఇక్కడి వచ్చా. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్' అని అన్నారు.
కాగా.. ఈ సినిమాను బన్నీవాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎస్.ఎస్.కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతమందిస్తున్నారు.