విదేశాలకు వెళ్లినా దీని గురించే అడుగుతున్నారు: ఖుషి మ్యూజిక్‌ డైరెక్టర్‌ | 'Kushi' will be a musical blockbuster, says music director Hesham Abdul Wahab - Sakshi
Sakshi News home page

విదేశాలకు వెళ్లినా దీని గురించే అడుగుతున్నారు: ఖుషి మ్యూజిక్‌ డైరెక్టర్‌

Aug 28 2023 4:16 AM | Updated on Aug 28 2023 9:38 AM

Kushi will be a musical blockbuster says music director Hesham Abdul Wahab - Sakshi

‘‘ఓ సినిమాకు సంగీతం బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనే నమ్మకం నాకు ఉంది. మంచి సంగీతం కోసం తాపత్రయపడే ఇండస్ట్రీ టాలీవుడ్‌’’ అని సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌  ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ మాట్లాడుతూ–‘‘నేను సంగీతం అందించిన మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘హృదయం’ విడుదల తర్వాత  ‘ఖుషి’ అవకాశం వచ్చింది. ‘ఖుషి’ టైటిల్‌సాంగ్‌కు ఎక్కువగా కష్టపడ్డాను. ‘నా రోజా నువ్వే..’ పాటలో మణిరత్నంగారి సినిమాల టైటిల్స్‌తో లిరిక్స్‌ ఉండేలా శివ నిర్వాణగారే ప్లాన్‌  చేసి, ఆయనే లిరిక్స్‌ కూడా రాశారు. సంగీతం పరంగా విజయ్‌గారు కూడా కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. ‘ఖుషి’ ప్రయాణం నాకు గొప్ప అనుభూతినిచ్చింది.. విదేశాలకు వెళ్లినా ‘ఖుషి’ పాటల గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమా మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. ప్రస్తుతం నాని ‘హాయ్‌ నాన్న’, శర్వానంద్‌ కొత్త సినిమాకు సంగీతం అందిస్తున్నా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement