కార్తీ, రాశీఖన్నాల 'సర్దార్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Kollywood Hero Karthi Sardar Gets Release Date | Sakshi
Sakshi News home page

కార్తీ, రాశీఖన్నాల 'సర్దార్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Oct 8 2022 9:20 AM | Updated on Oct 8 2022 9:20 AM

Kollywood Hero Karthi Sardar Gets Release Date - Sakshi

దీపావళికి సర్దార్‌ కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సర్దార్‌’. రాశీ ఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్లు. దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనుంది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కార్తీ ఆరు గెటప్స్‌లో నటించారు.

భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ‘మీరు వెతుకుతున్న స్పై పేరు ఏంటి?’, ‘అతనికి ఎనిమిది దేశాల పాస్‌పోర్ట్స్‌ ఉన్నాయి’, ‘ఆరువందల సార్లు ఇంట్రాగేట్‌ చేశాం. ప్రతిసారీ ఒక్కో లాంగ్వేజ్‌.. ఒక్కో కథ.. ఇవన్నీ నిజమేనని మిషన్‌ చెబుతోంది’, ‘ఆ ఆరుమంది ఒక్కరే..’ అనే డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement