దిల్లీ రిటర్న్స్‌ | Khaidi Sequel: Karthi to return as Dilli shortly | Sakshi
Sakshi News home page

దిల్లీ రిటర్న్స్‌

Mar 16 2025 1:26 AM | Updated on Mar 16 2025 1:26 AM

Khaidi Sequel: Karthi to return as Dilli shortly

దిల్లీ రిటర్న్స్‌ అని హీరో కార్తీ అంటున్నారు. హీరో కార్తీ, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఖైదీ (2019)’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో దిల్లీ అనే ఖైదీ పాత్రలో కార్తీ మంచి నటన కనబరిచారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ చేయాలని కార్తీ, లోకేశ్‌ ఎప్పట్నుంచో ప్లాన్‌ చేస్తున్నారు. కానీ లోకేశ్‌కు ఉన్న ఇతర కమిట్‌మెంట్స్‌ కారణంగా ‘ఖైదీ 2’ చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది.

కాగా ఈ ఏడాది ‘ఖైదీ 2’ చిత్రీకరణప్రారంభం అవుతుందన్నట్లుగా ‘ఎక్స్‌’లో ‘దిల్లీ రిటర్న్స్‌’ అంటూ పేర్కొన్నారు కార్తీ. ‘ఖైదీ’ సీక్వెల్‌ ‘ఖైదీ 2’ సినిమాను డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్, కేవీన్‌ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు లోకేశ్‌ కనగరాజ్‌. ‘సర్దార్‌ 2’ మూవీతో బిజీగా ఉన్నారు కార్తీ... వీరిద్దరూ వారి వారి కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత ‘ఖైదీ 2’ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement