యాక్టింగ్‌ రాదని ట్రోలింగ్‌.. : రష్మిక మందన్నా ఎమోషనల్‌ | Rashmika Mandanna Speech at Telangana Gaddar Film Awards | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక స్పీచ్‌ విని విజయ్‌ తల్లి భావోద్వేగం

Mar 20 2026 11:09 AM | Updated on Mar 20 2026 11:15 AM

Rashmika Mandanna Speech at Telangana Gaddar Film Awards

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్‌ అవార్డ్స్‌ వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేశారు. 2025లో విడుదలైన సినిమాలకుగానూ అవార్డులు అందించారు. ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాకుగానూ రష్మిక మందన్నా ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, హీరో రామ్‌చరణ్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం స్టేజీపై భావోద్వేగానికి లోనైంది. రష్మిక మాట్లాడుతూ.. ఒకప్పుడు నాకు యాక్టింగ్‌ రాదని ట్రోల్‌ చేశారు. కానీ, ఈ రోజు నా పర్ఫామెన్స్‌ మెచ్చి రాష్ట్రస్థాయిలో అవార్డు ఇచ్చారు. అది నాకెంతో గర్వంగా ఉంది.

తెలంగాణ కోడలిగా..
గర్ల్‌ఫ్రెండ్‌ లాంటి సినిమాకు అవార్డు రావడం నిజంగా చాలా స్పెషల్‌. డైరెక్టర్‌ రాహుల్‌ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పటివరకు నన్ను కూతురిలా ఆదరించారు. ఇప్పుడు నేను తెలంగాణ కోడలిగా మీ ముందు నిల్చున్నాను. మీ ప్రేమాభిమానాలకు నేను సర్వదా కృతజ్ఞరాలిని. నా ఫ్యామిలీని బాగా చూసుకోండి అని చెప్పుకొఒచ్చింది. రష్మిక ప్రసంగం వింటూ విజయ్‌ దేవరకొండ తల్లి భావోద్వేగానికి లోనైంది.

చదవండి: హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌.. ఒప్పుకోలేదు: నటుడు

Advertisement
 
Advertisement
Advertisement