ఫ్రీగా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌.. రిజెక్ట్‌ చేశా: అనుపమ్‌ ఖేర్‌ | Anupam Kher Refused to Get Hair Transplant Despite Offered Money | Sakshi
Sakshi News home page

Anupam Kher: డబ్బులిచ్చి మరీ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌.. నేనే ఒప్పుకోలేదు

Mar 20 2026 10:05 AM | Updated on Mar 20 2026 10:12 AM

Anupam Kher Refused to Get Hair Transplant Despite Offered Money

టాలెంట్‌ ఉంటే చాలు ఎలాగైనా రాణించవచ్చనుకున్నాడు నటుడు అనుపమ్‌ ఖేర్‌. కానీ, ఆయన బట్టతలను చూసి ఈయనెలా నటుడవతాడని చాలామంది సంశయించారు. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే, హమ్‌ ఆప్కే హై కోన్‌, ద కాశ్మీర్‌ ఫైల్స్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో నటించాడు. రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు.

అంకుల్‌ అని పిలవద్దు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ.. యువతరం నన్ను సర్‌, అంకుల్‌ అని పిలిస్తే నచ్చదు. ఏకే లేదా అనుపమ్‌ గారు అంటే సరిపోతుంది. అంతేకానీ అంకుల్‌ అని నన్ను వేరు చేయడం ఇష్టం లేదు. సినిమా దగ్గరినుంచి ఏఐ, సైన్స్‌.. ఇలా అన్నిరకాల అంశాల గురించి చర్చించడం నాకెంతో ఇష్టం. ఇకపోతే ఎంతోమంది డాక్టర్లు నాకు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తామని ముందుకు వచ్చారు. 

పేపర్‌లో యాడ్‌
కానీ, వాళ్లందరినీ సున్నితంగా తిరస్కరించాను. నా తలపై వెంట్రుకలు వచ్చేందుకు డబ్బు ఖర్చుపెట్టేందుకు రెడీ అయినవాళ్లూ ఉన్నారు. కానీ, నేను వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అలా డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు. ఒకసారి ఏమైందంటే నేను న్యూస్‌పేపర్‌ చదువుతున్నాను. అందులో హెయిర్‌ ఆయిల్‌ కోసం ఓ వాణిజ్య ప్రకటన వేశారు. అది నేను చూడలేదు. 

సినిమా
కానీ, నా కొడుకు సికందర్‌ నేను యాడ్‌నే చూస్తున్నా అనుకుని.. దాని గురించి ఆలోచించకు నాన్న అన్నాడు. ఎన్నో ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఘోస్లా 2. ఇది 2006లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ఖోస్లా కా ఘోస్లా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ప్రశాంత్‌ భాగియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కానుంది.

చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలో కొత్త సినిమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement