కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత | KGF Actor Harish Rai Passes Away After Cancer Battle in Bengaluru | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌తో పోరాటం.. కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

Nov 6 2025 12:52 PM | Updated on Nov 6 2025 1:07 PM

KGF Actor Harish Rai Passed Away after Battling with Thyriod Cancer

కన్నడ నటుడు, కేజీఎఫ్‌ ఫేమ్‌ హరీశ్‌ రాయ్‌ (Harish Rai) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసిన హరీశ్‌.. కేజీఎఫ్‌ మూవీలో చాచా అనే ముస్లిం వ్యక్తిగా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కేజీఎఫ్‌ రెండో పార్ట్‌ రిలీజయ్యే సమయానికి ఆయనకు థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది.

క్యాన్సర్‌తో పోరాటం
చూస్తుండగానే క్యాన్సర్‌ ముదిరి నాలుగో స్టేజీకి చేరింది. ఈ మహమ్మారి కారణంగా అతడు బక్కపలుచగా మారిపోయారు, కానీ, పొట్టభాగం మాత్రం ఉబ్బిపోయింది. చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు అవుతాయని.. ఎవరైనా సాయం చేయండంటూ ఆగస్టులో మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్‌ సర్జా తనకు తోచిన సాయం చేశారు. గతంలో యష్‌ కూడా సాయం చేశారు. ఇకపోతే హరీశ్‌ రాయ్‌.. ఓం, రాజ్‌ బహదూర్‌, దండుపాల్య, సంజు వెడ్స్‌ గీత వంటి పలు చిత్రాల్లో నటించారు.

చదవండి: స్పిరిట్‌లో దగ్గుబాటి హీరో? కెరీర్‌ టర్న్‌ అవడం ఖాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement