పబ్‌లో చిల్‌ అవుతున్న కీర్తి సురేశ్‌.. డ్యాన్స్‌ వీడియో వైరల్‌ | Keerthy Suresh New and Upcoming Movies - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: పబ్‌లో చిల్‌ అవుతున్న కీర్తి సురేశ్‌.. డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Published Sat, Aug 26 2023 12:18 PM | Last Updated on Sat, Aug 26 2023 12:43 PM

Keerthy Suresh Upcoming Movies Updates - Sakshi

తమిళసినిమా: కీర్తిసురేశ్‌ ఇప్పుడు విజయాల మీద సవారీ చేస్తుందనే చెప్పాలి. ఆమధ్య వరుస ఫ్లాప్‌లతో సతమతమైన ఈ కేరళ కుట్టి నటిగా మాత్రం ఫెయిల్‌ కాలేదు. నటనపై ఈమె అంకితభావమే ఇప్పుడు మళ్లీ గాడిలో పడేలా చేసిందని చెప్పవచ్చు. మహానటి వంటి అద్భుత విజయం సాధించిన చిత్రం తర్వాత కీర్తి సురేశ్‌ కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించడం మొదలెట్టింది. అలా అనడం కంటే ఆమెను దర్శక, నిర్మాతలు అలాంటి పాత్రలకు ఎంపిక చేశారు అని చెప్పవచ్చు. అయితే ఆ చిత్రాలు కీర్తిసురేశ్‌కు ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేదు.

ఇటీవల తెలుగులో నటించిన దసరా చిత్రం , తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ సరసన నటించిన మామన్నన్‌ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతోపాటు కీర్తిసురేశ్‌ సహజత్వంతో కూడిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. అంతేకాదు ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పటివరకు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న కీర్తిసురేశ్‌కు ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి కూడా పిలుపు రావడం విశేషం.

హిందీలో వరుణ్‌ ధావన్‌ సరసన నటించబోతోంది. అదేవిధంగా తెలుగులో నాగచైతన్య సరసన నూతన చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. తమిళంలో జయంరవి సరసన సైరన్, రివాల్వర్‌ రోటా, రఘు తాత అనే లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు చేస్తున్నారు. ఇంత బిజీలోనూ కీర్తిసురేశ్‌ పబ్‌ల్లో పాటలతో చిల్‌ అవుతోంది. ఈమె స్నేహితులతో ఒక పబ్‌లో డాన్స్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement