సత్యవాన్‌ సావిత్రి | Keerthy Suresh in Sathyavan Savithiri first look | Sakshi
Sakshi News home page

సత్యవాన్‌ సావిత్రి

May 1 2026 12:02 AM | Updated on May 1 2026 12:02 AM

Keerthy Suresh in Sathyavan Savithiri first look

ఓ సామాజిక అంశం కోసం కోర్టులో లాయర్‌గా వాదనలు వినిపించనున్నారట కీర్తీ సురేష్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘సత్యవాన్‌ సావిత్రి’. దర్శకుడు మిస్కిన్‌ ఈ సినిమాలో మరో లీడ్‌ రోల్‌ చేశారు. ప్రవీణ్‌ ఎస్‌. విజయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

గురువారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మిస్కిన్‌ లాయర్స్‌గా నటించారని తెలిసింది. మరోవైపు తెలుగులో వెంకటేశ్‌–కల్యాణ్‌రామ్‌ హీరోలుగా నటిస్తున్న సినిమాలోను, విజయ్‌ దేవరకొండ ‘రౌడీ జానర్ధన’లోనూ కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement