డాడా హీరో కొత్త మూవీ.. రిలీజ్‌ ఎప్పుడంటే? | Kavin Mask Movie Release Date Out Now | Sakshi
Sakshi News home page

డాడా హీరో కొత్త మూవీ.. ఆ సంస్థ చేతికి ఓటీటీ రైట్స్‌

Oct 26 2025 9:03 AM | Updated on Oct 26 2025 9:03 AM

Kavin Mask Movie Release Date Out Now

డాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో కెవిన్‌ (Kavin). అయితే ఆ తర్వాత నటించిన బ్లడీ బెగ్గర్, ఇటీవల విడుదలైన కిస్‌ చిత్రాలు ఈయన్ని పూర్తిగా నిరాశపరిచాయి. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్క్‌. ఆండ్రియా హీరోయిన్‌గా నటించారు. అంతేకాకుండా ఈమె చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం విశేషం. ఇందులో మరో హీరోయిన్‌గా రుహాని శర్మ కూడా నటించారు. చార్లీ, రమేష్‌ తిలక్, కల్లూరి విను, అర్చన చాందోక్‌ తదితరులు ముఖ్యపాత్రులు పోషించారు. 

దర్శకుడు వెట్రిమారన్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ద్వారా విక్రమన్‌ అశోక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని, ఆర్‌డీ రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్‌ 21వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర పోస్టర్‌ ఇటీవల దీపావళి సందర్భంగా విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ, ఆడియో హక్కులను టి సిరీస్‌ సంస్థ పొందినట్లు చెప్పారు. ఇది పూర్తిగా చెన్నై నేపథ్యంలో సాగే డార్క్‌ కామెడీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.

 

 

చదవండి: కొద్దిరోజులుగా మాస్క్‌తోనే రష్మిక.. కారణం ఇదేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement