రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. త్వరలోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకుంటుందని అంతా భావించారు.
ప్రస్తుతం థియేటర్లలో కాంతారకు పోటీగా పెద్ద చిత్రాలు కూడా లేకపోవడం కలిసొస్తుందని అనుకున్నారు. కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోన్న టైమ్లో ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీకి తీసుకు రావడంపై ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న సమయంలోనే ఓటీటీ డేట్ను అఫీషియల్గా ప్రకటించడం కాంతార అభిమానులను డైలామాలో పడేసింది. ఈ ప్రకటనతో మూవీ వసూళ్లపై ప్రభావం పడుతుందని చాలా మంది ఆడియన్స్ ప్రశ్నించారు. దీంతో తాజాగా ఓటీటీ రిలీజ్పై హోంబాలే ఫిల్మ్స్ నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ స్పందించారు. త్వరగానే ఓటీటీకి తీసుకురావడంపై క్లారిటీ ఇచ్చారు.
చలువే గౌడ మాట్లాడుతూ..'ఈ సినిమా తమిళం, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వర్షన్‌లు మాత్రమే ప్రస్తుతం ఓటీటీలో విడుదలవుంది. అయితే హిందీ వర్షన్ వచ్చేది ఇప్పుడు కాదు. ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీకి వస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందం మూడేళ్ల క్రితమే జరిగింది. అందుకే ఇది మా వంతు బాధ్యత. అప్పట్లో పరిస్థితులు భిన్నంగా ఉండేది. కొవిడ్కు ముందు అన్ని సినిమాలకు ఎనిమిది వారాల సమయం ఉండేది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీకి వచ్చినప్పటికీ థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుంది. డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్స్ సాధిస్తుందని నమ్మకముంది. ఓటీటీకి రావడం 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.
కాగా.. ఈ దీపావళికి థియేటర్లలో థామా, ఏక్ దీవానే కి దేవానియాత్ లాంటి బాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ కాంతార చాప్టర్ 1 హిందీ వర్షన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైంది.


