మంచి చిత్రాలు తొక్కేసే బ్యాచ్‌.. భర్త సంపాదనతో ఎంజాయ్‌.. | Anupama Chopra Is Deeply Jealous: Kangana Ranaut - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: 12th ఫెయిల్‌ దర్శకుడి భార్యపై కంగనా ఫైర్‌

Published Mon, Feb 5 2024 1:40 PM

Kangana Ranaut Says Anupama Chopra Jealous of Her Husband Vidhu Vinod Chopra 12th Fail Success - Sakshi

ఇటీవలి కాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో 12th ఫెయిల్‌ ఒకటి. ప్రేక్షకులను కదిలించిన ఈ మూవీ గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఈ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు విధు వినోద్‌ చోప్రాను ఎంతోమంది భయపెట్టారు. పెట్టుబడిలో పావు వంతు కూడా రాదని, ఓటీటీకి ఇచ్చేయ్‌ అని ఉచిత సలహాలిచ్చారు. వారిలో విధు వినోద్‌ భార్య, సినీ క్రిటిక్‌ అనుపమ చోప్రా కూడా ఒకరు.

తెలివైన వాళ్లంటే జెలసీ..
భార్య కూడా తన సినిమా మీద నమ్మకం పెట్టుకోలేదని, ఈ చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్‌కు రారని విమర్శించిందని చెప్పాడు డైరెక్టర్‌. తాజాగా ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందించింది. ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా అనుపమపై ఫైర్‌ అయింది. 'విధు సర్‌ భార్య అనుపమ చోప్రాకు తెలివైన అమ్మాయిలంటే జెలసీ. వాళ్లంటనే ఈమెకు గిట్టదు. అలాంటి వ్యక్తి భర్తపై అసూయపడటంలో ఆశ్చర్యం లేదు. ఆయన సంపాదించిన పేరు, డబ్బుతో ఈమె సొంతంగా వెబ్‌సైట్‌ పెట్టింది, చిన్నచిన్నవ్యాపారాలు చేస్తూ ఉంటుంది.

ఆ గ్యాంగ్‌తోనే జత కడుతుంది
బాలీవుడ్‌ డైరెక్టర్‌ భార్యగా సినిమా పార్టీలకు, ఈవెంట్లకు వెళ్తుంటుంది. అక్కడ టాలెంట్‌ను, మంచి చిత్రాలను తొక్కేయాలనుకునే గాసిప్‌ గ్యాంగ్‌తో జత కడుతుంది' అని విమర్శించింది. ఇది చూసిన నెటిజన్లు నీ అంత బోల్డ్‌గా ఇండస్ట్రీలో ఎవరూ మాట్లాడలేరు అని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం 'ముందు నీ కెరీర్‌ క్లోజ్‌ కాకుండా చూసుకో.. ఈ గొడవలు పక్కన పెట్టి సినిమాల మీద ఫోకస్‌ చేయు' అని సలహా ఇస్తున్నారు. కాగా గతంలో అనుపమ చోప్రా - కంగనా రనౌత్‌ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు.

చదవండి: ఆ సింగర్‌ ఇంట్లో పని చేశా.. తర్వాతే ఈ బిజినెస్‌... సందీప్‌ కిషన్‌ ఎంతిచ్చాడంటే?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement