
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజీపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నానే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై కంగనా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అని.. ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయినా దేశానికి సేవ చేస్తునే ఉంటాను’అంటూ తన పొలిటికల్ ఎంట్రీపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
‘నేను నటిగా కంటే జాతీయవాదిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాను. సినిమా సెట్ నుంచే రాజకీయ పార్టీలతో పోరాడాను. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా దేశం కోసం పనిచేస్తూనే ఉంటాను. ఇవన్నీ చేయకుండా నన్ను ఎవరూ ఆపలేరు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే నాకు సరైన సమయం. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోను. ఈ దేశంలో నాకు అన్ని ప్రాంతాలతో మంచి అనుబంధం ఉంది. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలు నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వడం నా బాధ్యత. నన్ను ప్రశంసిస్తూ అభిమానించేవారికి రుణపడి ఉంటాను’ అని కంగనా చెప్పుకొచ్చింది.