Kangana Ranaut: కంగనాకు కోర్టులో చుక్కెదురు.. సెలబ్రిటీ అయినా పాటించాలి

Kangana Ranaut Permanent Exemption Appeal Rejected - Sakshi

Kangana Ranaut Permanent Exemption Appeal Rejected In Javed Akhtar Case: బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పలు విమర్శలపాలైంది. కంగనా మాట ధోరణి చూసి ఆమెకు అభిమానులు అయిన వారు కూడా లేకపోలేదు. అయితే తాజాగా కంగనాకు ముంబై కోర్టులో చుక్కెదురైంది. బీటౌన్‌ ఫైర్‌బ్రాండ్‌పై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్‌ పరువు నష్టం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరు నుంచి 'శాశ్వత మినహాయింపు' కోసం దరఖాస్తు పెట్టుకుంది. కంగనా పెట్టుకున్న ఆ దరఖాస్తును ముంబై కోర్టు తిరస్కరించింది. 

చదవండి: కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్‌.. వాటి విలువ ఎంతంటే?

బాలీవుడ్‌ చిత్రసీమలో స్టార్‌ హీరోయిన్లలో తాను ఒకరినని, వృత్తిపరంగా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కంగనా అభ్యర్థించింది. 'కంగనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండొచ్చు.. కానీ, ఆమె ఒక కేసులో నిందితురాలు. ఆ విషయాన్ని ఆమె మర్చిపోవద్దు.' అని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆర్ఆర్ ఖాన్‌ స్పష్టం చేశారు. కేసు విచారణకు కంగనా సహకరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చిన పద్దతిలో కంగనా వ్యవహరిస్తోందని కోర్టు తెలిపింది. 

చదవండి: మీరు చాలా హాట్‌గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్‌తో కంగనా

ఆమె సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఒక నిందితురాలిగా కోర్టు నిబంధనలు పాటించక తప్పదని వెల్లడించింది. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని కోర్టు సూచించింది. బెయిల్‌ బాండ్ కోసం చట్టపరంగా ఉన్న నియమనిబంధనలను పాటించాలని ఆదేశించింది. నవంబర్‌ 2020లో ఓ ఇంటర్వ్యూలో కంగనా తనపై అనుచితి వ్యాఖ్యలు చేసిందని జావేద్ అక్తర్‌ పరువునష్టం దావా వేశారు. 

చదవండి: కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top