భూతల్లి పై ఒట్టేయ్‌... | Sakshi
Sakshi News home page

భూతల్లి పై ఒట్టేయ్‌...

Published Thu, May 23 2024 6:26 AM

Kamal Haasan, Shankar Indian 2 To Audio Release On 1 June 2024

‘శౌర..’ అంటూ చైతన్య గీతం పాడారు సేనాపతి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో విడుదలైన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘ఇండియన్‌’ (‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్‌ 2, ఇండియన్‌ 3’ (‘భారతీయుడు 2, 3’)’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శంకర్‌. ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్‌. 

రెడ్‌ జెయింట్‌ మూవీస్, లైకా ్ర΄÷డక్షన్స్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్‌ 1న చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘భూతల్లి పై ఒట్టేయ్‌... తెలుగోడి వాడి చూపెట్టేయ్‌...’ అంటూ సాగే తెలుగు పాట ‘శౌర..’కు సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించగా, రితేష్‌ జి. రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్‌ 2’ చిత్రం విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement