ఇండియన్‌-2 పై నెగెటివ్‌ టాక్‌.. మేకర్స్ కీలక నిర్ణయం! | Kamal Haasan's Indian 2 Movie Runtime Trimmed In Minutes | Sakshi
Sakshi News home page

Indian 2 Movie: ఇండియన్‌-2పై నెగెటివ్‌ టాక్‌.. మొత్తానికి తగ్గించేశారు!

Jul 17 2024 4:36 PM | Updated on Jul 17 2024 4:50 PM

Kamal Haasan's Indian 2 Movie Runtime Trimmed In Minutes

కమల్ హాసన్‌- శంకర్‌ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్‌-2. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. 
దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ భారీగా పడిపోయాయి. అయితే ఇండియన్‌-2 నిడివి ఎక్కువగా ఉండడం.. శంకర్‌ మార్క్ కనిపించలేదంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి.

అయితే నిడివి ఎక్కువగా ఉండడం.. మూవీకి నెగెటివ్ టాక్‌ రావడంతో మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 3.04 నిమిషాల రన్‌టైమ్‌తో థియేటర్లలోకి వచ్చిన ఇండియన్‌-2 నిడివి తగ్గించినట్లు లైకా ప్రొడక్షన్స్‌ తాజాగా ట్వీట్‌ చేసింది. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించింది. మీకు దగ్గర్లోని థియేటర్‌కు రన్‌ టైన్‌ తగ్గించిన ఇండియన్‌-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. 

పడిపోయిన వసూళ్లు

ఇండియన్-2కు మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఇండియావ్యాప్తంగా కేవలం రూ.65 కోట్లకు పైగా వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీని  లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో కమల్ అవినీతిపై పోరాడే సేనాపతి పాత్రలో కనిపించారు. ఇందులో సముద్రఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement