ఇట్స్‌ రొమాంటిక్‌ టైమ్‌! | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ రొమాంటిక్‌ టైమ్‌!

Published Mon, Feb 19 2024 2:58 AM

Kalki 2898 AD Grand Release on May 9th 2024 - Sakshi

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్‌ అండ్‌ ఫ్యూచరిస్ట్‌ ఫిల్మ్‌ ‘ కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, అన్నాబెన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ మూవీకి సంబంధించిన మేజర్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో ్రపారంభమైంది.

ఈ షెడ్యూల్‌లో సినిమాలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్, దిశాపటానీ కాంబి నేషన్‌లో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట దర్శకుడు నాగ్‌అశ్విన్‌. ఈ సాంగ్‌ పూర్తయిన తర్వాత కొంత టాకీ పార్టు, ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్‌ చేశారట. సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ   చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement