ముందుగానే వచ్చేస్తున్న దేవర.. ఎప్పుడంటే? | Devara – Part 1 New Release Date Out Now | Sakshi
Sakshi News home page

Devara Movie: దేవర రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. గేమ్‌ ఛేంజర్‌ కంటే ముందే!

Published Thu, Jun 13 2024 5:42 PM | Last Updated on Thu, Jun 13 2024 6:19 PM

Jr NTR Devara Movie Release Date Out Now

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ క్రేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీళ్లిద్దరూ థియేటర్‌లో కనిపించి రెండేళ్లపైనే అవుతోంది. ఇంతవరకు అటు తారక్‌, ఇటు చరణ్‌ తన అభిమానులను పలకరించిందే లేదు. చరణ్‌ 'ఆచార్య'లో గెస్ట్‌ రోల్‌లో మెరిశాడు కానీ పూర్తి స్థాయిలో నటించిన సినిమా విడుదల కానేలేదు.

పార్ట్‌ 1 రిలీజ్‌ డేట్‌
ప్రస్తుతం తారక్‌ దేవరతో, చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా 'దేవర - పార్ట్‌ 1' విడుదల తేదీ ప్రకటించారు. సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేశారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సింది. షూటింగ్‌ ఆలస్యం కావడంతో అక్టోబర్‌ 10కి వాయిదా వేశారు. ఇప్పుడు దాన్ని రెండు వారాలు ముందుకు జరిపి తీసుకొస్తున్నారు.

కొరటాల డైరెక్షన్‌లో
దేవర సినిమా విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుద్‌ రవిచంద్ర సంగీతం అందిస్తున్నాడు. గేమ్‌ ఛేంజర్‌ విషయానికి వస్తే శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement