
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ నుంచి రానున్న తాజా చిత్రం ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, అర్షద్ వార్షి ప్రధాన పాత్రధారులుగా నటించారు. సౌరభ్ శుక్లా, హ్యూమా ఖురేషీ, అమ్రితా రావు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుభాష్ కపూర్ దర్శకత్వంలో అలోక్ జైన్, అజిత్ అంథారే నిర్మించిన ఈ చిత్రంసెప్టెంబరు 19న విడుదల కానుంది.
ఈ చిత్రంలో లాయర్ జగదీశ్వర్ జాలీ మిశ్రా పాత్రలో అక్షయ్ కుమార్, లాయర్ జగదీష్ జాలీ త్యాగి పాత్రలో అర్షద్ వార్షి, జడ్జ్ పాత్రలో సౌరభ్ శుక్లా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ అక్షయ్, అర్షద్‌ల మధ్య గొడవలు, కోర్ట్ రూమ్‌లో జరిగే కామెడీ డ్రామాగా సాగుతుంది.