స్టార్‌ హీరోపై జెడి చక్రవర్తి సంచలన ఆరోపణలు.. ఇండస్ట్రీని కుదిపేసే వార్త | JD Chakravarthy Controversial Comments On Tollywood Big Star And Hints At Dark Side Of Him, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోపై జెడి చక్రవర్తి సంచలన ఆరోపణలు.. ఇండస్ట్రీని కుదిపేసే వార్త

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 10:16 AM

JD Chakravarthy Controversy Comments On Tollywood Big Star

టాలీవుడ్‌ నటుడు జెడి చక్రవర్తి సుమారు 35ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో ఉన్నారు. తన ప్రయాణం శివ సినిమాతో మొదలైన విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్‌ హీరో రేంజ్‌ స్టేటస్‌ను ఆయన అందుకున్నారు. హీరోగా ఇండస్ట్రీలో సూపర్‌ హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే, తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమలోనే  అతిపెద్ద స్టార్‌ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, పేరు రివీల్‌ చేయకుండానే బిగ్‌ కాంట్రవర్సీ క్రియేట్‌ చేసే కామెంట్స్‌ను షేర్‌ చేశారు.

మనం అభిమానించే వ్యక్తుల గురించి అసలు విషయాలు తెలియకుండానే గౌరవం పెంచుకుంటే అది పొరపాటే అంటూ తనకు ఎదురైన ఒక సంఘటనను జె. డి. చక్రవర్తి ఇలా పంచుకున్నారు.'ఒక నటుడు అంటే నాకు చాలా రెస్పెక్ట్‌. కానీ, అతని పేరు మాత్రం చెప్పను. ఆ హీరో అంటే నాకు మాత్రమే కాదు.. యావత్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇండియాకు కూడా ఆయన అంటే గౌరవం. అలాగే నిజ జీవితంలో ఉంటారని అనుకున్నాను. కానీ, సినిమా సెట్స్‌కు ఆయన  ఆలస్యంగా వస్తారు సార్‌  అని నాతో కొందరు చెప్పారు. ఎందుకంటే..? రాత్రి తాగింది దిగలేదన్నారు. 

అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిజమా..! ఆయన తాగుతారా..? అని ప్రశ్నించాను. ఆయనకు అప్పటికే వయసు అయిపోయింది. హోటల్‌లో కూడా బస చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఉంటున్నారని చెప్పడంతో ఆయనకు పెళ్లైంది కదా అన్నాను. లేదు గర్ల్‌ఫ్రెండ్‌తోనే ఉంటున్నారని చెప్పారు. ఆ రోజు వరకు ఆయనకున్న ఇమేజ్‌ను బట్టి నేను కూడా మహానుబావుడు అనుకున్నాను.' అని రియాలిటీ మరోలా ఉంటుంది అనేలా జెడి చక్రవర్తి పేర్కొన్నారు. అయితే, ఆ స్టార్‌ హీరో ఎవరు అనేది మాత్రం ఆయన రివీల్‌ చెయలేదు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement