రెండు పాత్రల కథ 

Jayam Ravi Siren Teaser released by Successful Producer Dil Raju - Sakshi

జయం రవి, కీర్తీ సురేష్‌ నటించిన చిత్రం ‘సైరన్ ’. ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో సుజాత విజయ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత ‘దిల్‌’ రాజు విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ , థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన చిత్రం ‘సైరన్‌’. రెండు పాత్రల మధ్య నడిచే కథ ఇది.

ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్‌ ఇన్ స్పెక్టర్‌ పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు. ఈ మూవీలో తొలిసారి సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో కొత్తగా కనిపిస్తారు రవి. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్‌.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top