పెళ్లి కాకుండా తల్లయినా ఎలాంటి అభ్యంతరం లేదు.. ఆమెపై జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్ | Jaya Bachchan says No Problem If Navya Naveli Nanda Has a Child Without Marriage | Sakshi
Sakshi News home page

Jaya Bachchan: పెళ్లి కాకుండా తల్లయినా నాకెలాంటి అభ్యంతరం లేదు.. మనవరాలికి జయా బచ్చన్ సలహా

Published Sat, Oct 29 2022 2:54 PM | Last Updated on Sat, Oct 29 2022 3:17 PM

Jaya Bachchan says No Problem If Navya Naveli Nanda Has a Child Without Marriage - Sakshi

బాలీవుడ్ సీనియర్ నటి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వాట్‌ ది హెల్ నవ్య పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్‌లో పాల్గొన్న ఆమె ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలపై స్పందించారు. ఈ సందర్భంగా తన మనవరాలికి ఓ అదిరిపోయే సలహా కూడా ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుత సమాజంలో ఆధునిక పోకడల ప్రకారం తన మనవరాలు నవ్య నవేలి నందా పెళ్లి కాకుండా తల్లయినా ఫర్వాలేదని.. తనకేలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. 

జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'ఈ తరానికి నేను ఇచ్చే సూచన ఏమిటంటే... నేను చాలా వైద్యపరమైన మార్పులు చాలా చూశాను. ఎలాంటి ఎమోషన్స్ లేకుండానే రొమాన్స్ చేసుకుంటున్నారు. నవ్య మీరు మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. నీకు మంచి స్నేహితుడు ఉండి.. నిన్ను ఇష్టపడి బిడ్డను కలిగి ఉండాలనుకుంటే.. ఈ సమాజంతో పనిలేదు. పెళ్లి కాకుండానే బిడ్డ ఉంటే నాకు ఎలాంటి సమస్య లేదు.' అంటూ మనవరాలు నవ్య నవేలి నందకు సలహా ఇచ్చింది. 

ఈ ఎపిసోడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో తన పెళ్లి ఎలా జరిగిందనే విషయాన్ని జయా బచ్చన్ పంచుకున్నారు. మేం మొదట అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. అయితే జంజీర్ సక్సెస్ తర్వాత వెకేషన్‌కు వెళ్లే ముందు పెళ్లి చేసుకోవాలని వారి తల్లిదండ్రులు సూచించారని ఆమె చెప్పారు. అందుకే జూన్‌లో పెళ్లి జరిగిందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement