ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్! | Sakshi
Sakshi News home page

Atlee: 'జవాన్' దర్శకుడు తెలుగింటి అల్లుడే.. ఇది మీకు తెలుసా?

Published Sun, Sep 24 2023 4:51 PM

Jawan Director Atlee Colour Trolls Wedding With Krishna Priya - Sakshi

బాద్‌షా షారుక్ ఖాన్ లాంటి హీరోతో సినిమా చేయడమే గొప్ప. అలాంటిది తమిళం నుంచి బాలీవుడ్‌కి వెళ్లి మరీ దర్శకుడు అట్లీ 'జవాన్' తీశాడు. అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ రూ.1000 కోట్ల వరకు కలెక్ష‍న్స్ సాధించడం విశేషం. ఇప్పుడు అందరూ తెగ పొగిడేస్తున్న డైరెక్టర్ అట్లీ.. గతంలో తన రంగు విషయమై చాలా ట్రోల్స్ అనుభవించాడు.

ఆ హీరోతో సినిమా వల్ల
స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'రోబో', 'స్నేహితుడు' సినిమాలకు ఆయన దగ్గర పనిచేశాడు. 'రాజా రాణి' మూవీతో దర్శకుడు అయిపోయాడు. తమిళ, తెలుగులో ఈ మూవీ సూపర్‌హిట్ అయింది. దీని తర్వాత విజయ్‌తో తెరి (పోలీసోడు) అనే సినిమా తీశాడు. విజయ్ అంటే పడని కొందరు అట్లీని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!)

కలర్ కామెంట్స్
అయితే 'తెరి' సినిమా చేస్తున్న సమయంలోనే నటి కృష్ణప్రియతో అట్లీకి పెళ్లయింది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబం ఆమెది. సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటిస్తూ పేరు తెచ్చుకున్న ఈమె.. సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే అట్లీకి పరిచయమైంది. అలా ఐదేళ్ల పాటు సాగిన వీళ్ల బంధం చివరకు పెళ్లి వరకు వెళ్లింది.

అయితే పెద్దల్ని ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ తో సినిమా చేస్తున్నాడని పడని కొందరు.. అట్లీ కలర్‌ని ఉద్దేశిస్తూ.. కృష్ణప్రియతో ఉన్న ఫొటోలపై కామెంట్స్ చేశారు. 'కాకి ముక్కుకు దొండపండు' అని ఎగతాళి చేశారు. మొన్న 'జవాన్' రిలీజ్ టైంలోనే ఈ తరహా విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పెద్దగా మనసులో పెట్టుకోని అట్లీ.. నవ్వుతూ ముందుగు సాగిపోతున్నాడు.

(ఇదీ చదవండి: నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: కమల్‌ హాసన్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement