అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు | Janhvi Kapoor Recalls Heartbreaking Moment When She Learnt Sridevi Died | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అమ్మ మరణం.. రోదిస్తూ గదిలోకి వెళ్లా.. ఎమోషనలైన శ్రీదేవి పెద్ద కూతురు

Jan 4 2024 1:02 PM | Updated on Jan 4 2024 1:19 PM

Janhvi Kapoor Recalling Heartbreaking Moment She Learnt Sridevi Died - Sakshi

నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. వెంటనే నేను భయంతో ఏమైందని అడుగుతూనే నాకు తెలియకుండానే ఏడుస్తూ తన గదికి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. 

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌- దివంగత హీరోయిన్‌ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ 2018లో 'ధడక్‌' సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టింది. మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకు తెలుగులో ఓ సినిమాకు సంతకం చేసింది. దేవరలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటిస్తోంది. అటు జాన్వీ సోదరి ఖుషీ కపూర్‌ ఈ మధ్యే 'ద ఆర్చీస్‌' చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్‌ కరణ్‌ 8వ సీజన్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మ చనిపోయిన క్షణాలని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు. జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ.. 'నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఓపక్క రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు' అని చెప్పుకొచ్చింది.

ఖుషీ మాట్లాడుతూ.. 'నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే అందరూ నేను చాలా స్ట్రాంగ్‌ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా ఫిక్సయ్యాను' అని చెప్పుకొచ్చింది. కాగా అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో కన్నుమూసింది.

చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్‌ చేసుకుంటూ వెళ్లిన వరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement