'జన నాయగన్‌' సినిమా లీక్‌.. ఆరుగురి అరెస్ట్‌ | Jana Nayagan Movie Leak six persons arrested by Tamil Nadu police | Sakshi
Sakshi News home page

'జన నాయగన్‌' సినిమా లీక్‌.. ఆరుగురి అరెస్ట్‌

Apr 13 2026 8:40 AM | Updated on Apr 13 2026 8:55 AM

Jana Nayagan Movie Leak six persons arrested by Tamil Nadu police

విజయ్ నటించిన 'జననాయగన్‌'  మూవీ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌ అయింది. సెన్సార్‌కు ముందే ఇలా సినిమా లీక్‌ కావడంతో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. చిత్ర నిర్మాణ సంస్థ  కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. జననాయగన్‌ మూవీ లీక్‌ కారణమైన ఆరుగురిని తమిళనాడు సైబర్ క్రైమ్ అదుపులోకి తీసుకుంది. ఈ అంశంపై చిత్ర యూనిట్‌కు సంబంధించిన లాయర్ ఒక‌ పోస్ట్ షేర్‌ చేశారు.

జననాయగన్‌ సినిమా నుంచి లీకైన సీన్‌లను ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసినా, షేర్‌ చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సినిమాను లీక్‌ చేసిన ఆరుగురిని సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే  అరెస్టు చేసిందని లాయర్‌ పేర్కొన్నారు. క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు టెలిగ్రామ్ ద్వారా హై డెఫినిషన్ ప్రింట్‌ను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసి, పంపిణీ చేసిన ఒక సమన్వయ పైరసీ నెట్‌వర్క్‌లో ఈ అనుమానితులు భాగమని పోలీసులు భావిస్తున్నారు.  ఇప్పటికే కొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందో లేదో నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement