Jagapathi Babu Interesting Comments on His Daughter's Marriage - Sakshi
Sakshi News home page

Jagapathi Babu: చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్‌ కామెంట్స్‌

Feb 14 2023 6:12 PM | Updated on Feb 14 2023 7:08 PM

Jagapathi Babu Interesting Comments on His Daughter's Marriage - Sakshi

ఇండస్ట్రీలో సీనియర్‌ నటుడు జగపతి బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన ప్రస్తుతం విలన్‌గా మెప్పిస్తున్నారు. అయితే జగపతి బాబుతి విభిన్న శైలి అనే విషయం తెలిసిందే. ఎలాంటి అంశంపైన అయిన స్ట్రేట్‌ ఫార్వర్డ్‌గా మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న జగపతి బాబు తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు.

చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ

ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పిల్లలు, వారి పెళ్లిళ్లపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయి పేరు మేఘన.. అమెరికన్‌ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తాను అమెరికాలో సెటిల్‌ అయ్యింది. చిన్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. తనకి పెళ్లి చేసుకోవద్దనే చెప్పా. ఒకవేళ తను చేసుకుంటానంటే మాత్రం కాబోయే భర్తను తానే వెతుక్కోమని చెప్పాను. నేను మాత్రం అబ్బాయిని చూడనని చెప్పాను. పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి తప్పు చేశానని ఫీల్‌ అవుతున్నా’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: ఎయిర్‌పోర్ట్‌ వివాదం: విజయ్‌ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అనంతరం మాట్లాడుతూ.. ‘నా పిల్లలు అంటూ మన ఆశలను వారిపై రుద్దడం తప్పు. వారికంటూ ఓ జీవితం, స్వతంత్య్రం ఉంటుంది. మన స్వార్థం కోసం పిల్లలను పెళ్లి చేసుకోమనడం, పిల్లలను కను అనడం స్వార్థం అవుతుంది. తండ్రిగా పెళ్లి చేయడం నా బాధ్యత అని అనడం నా దృష్టిలో తప్పు. అది స్వార్థం అవుతుంది. నీ ఇష్టం.. నీకు నచ్చినంటూ నువ్వు ఉండు అని చెప్పడం ప్రేమ’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అదే విధంగా తన పెద్ద అమ్మాయి పిల్లలను కనని చెప్పిందని, కుక్కలు, పిల్లులను పెంచుకుంటానందని చెప్పిందన్నారు. తను అలా చెప్పడంతో వెంటనే సరే.. నీ ఇష్టమని చెప్పానని జగపతి బాబు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement