జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఇంటి వారయ్యారు!

Jacqueline Fernandez buy a new house in Mumbai - Sakshi

బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఇటీవలే ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్‌ ఖరీదు సుమారు ఏడు కోట్ల రూపాయలని సమాచారం. ఇంత కాలం ముంబైలో అద్దె ఇంట్లో ఉండేది జాక్వెలిన్‌. ఇప్పుడు ముంబైలోని జూహూ ప్రాంతంలో కొత్త ఫ్లాట్‌ తీసుకుంది. సముద్రం కనిపించే వ్యూతో బాల్కనీ, ఐదు  బెడ్‌రూమ్‌లు, విశాలమైన లివింగ్‌ ఏరియా ఈ ఇంటి స్పెషాలిటీ. గతంలో ఈ ఫ్లాట్‌లో ప్రియాంకా చోప్రా నివసించేది. హాలీవుడ్‌కి వెళ్లకముందు ప్రియాంక ఆ ఇంట్లోనే ఉండేది. నిక్‌తో వివాహం అయ్యాక లాస్‌ ఏంజెల్స్‌కి మకాం మార్చేసింది ప్రియాంక. ఆ తర్వాత ఇల్లు అమ్మింది.

జాక్వెలిన్‌ సినిమాల విషయానికొస్తే.. 2009లో అలాదిన్‌ సినిమాతో వెండితెరపై కాలు మోపింది. 'కిక్‌', 'రేస్‌ 3' సినిమాల్లో సల్మాన్‌తో నటించింది. 'కిక్‌' సీక్వెల్‌లో ఈ ఇద్దరూ మరోసారి జోడి కట్టనున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ ’బచ్చన్‌ పాండే’ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న రిలీజ్‌ కానుంది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌- క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఓ చిత్రంలోనూ ఈ భామ కనిపించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: ‘అంగూర్‌’ నవ్వించడానికి రెడీ

టాలీవుడ్‌లోకి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top