Interesting Facts About Meenakshi Chaudhary Journey From Dentist To Miss India - Sakshi
Sakshi News home page

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా?

Jun 13 2021 10:37 AM | Updated on Jun 13 2021 11:57 AM

Interesting Facts About Meenakshi Chaudhary - Sakshi

మీనాక్షికి స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం. రాష్ట్రస్థాయిలో పలు బ్యాడ్మింటన్, స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని మంచి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది

మీనాక్షి చౌదరి ...సొంతూరిలో మొదటి డాక్టరే కాదు.. ఫస్ట్‌ మోడల్‌.. వెరీ ఫస్ట్‌ యాక్టర్‌ కూడా.స్టెత్‌ను వదిలి స్టేజ్‌ను ఎంచుకున్న ఆ డాక్టర్‌ యాక్టర్‌ గురించి.. 

హర్యానాలోని పంచ్‌కుల గ్రామంలో పుట్టింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్‌ కావడంతో క్రమశిక్షణ ఆమె తోబుట్టువైంది. చదువుపై ఉన్న శ్రద్ధ, ఇష్టంతో నేషనల్‌ డెంటల్‌ కాలేజ్‌లో కోర్సు పూర్తి చేసింది.  2017, ప్రపంచ సుందరి విజేత ‘మానుషి చిల్లర్‌’ను చూసి స్ఫూర్తి పొందింది. 2018లో ‘మిస్‌ గ్రాండ్‌ ఇంటర్‌నేషనల్‌’ పోటీలో  రన్నరప్‌గా నిలిచింది.  ‘ఎఫ్‌బీబీ కలర్స్‌ ఫెమినా మిస్‌ ఇండియా హర్యానా 2018’  కిరీటం సాధించింది. వీటితో పాటు ‘మిస్‌ ఇండియా’  టైటిల్‌నూ  గెలుచుకుంది. 

మీనాక్షికి స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం. రాష్ట్రస్థాయిలో పలు బ్యాడ్మింటన్, స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని మంచి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న ‘అవుట్‌ ఆఫ్‌ లవ్‌’తో వెబ్‌ వీక్షకులను అలరిస్తోంది.  త్వరలో విడుదలవుతోన్న ‘ఖిలాడి’, ‘హిట్‌ 2’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’  వంటి తెలుగు సినిమాల్లోనూ  నటిస్తోంది మీనాక్షి.


మెడికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన నాకు అందాల పోటీల్లోని ‘ఓన్‌ మేకప్, ఓన్‌ హెయిర్‌ స్టైల్స్‌’ రౌండ్‌ పెద్ద సవాలుగా అనిపించేది.  మొదట్లో మేకప్‌ చేసుకోవడానికి చాలా టైమ్‌ పట్టేది. ఇప్పుడైతే చిటికెలో రెడీ అయిపోతున్నా– మీనాక్షి చౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement