పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి | Heroine Anjali Opens About Her Marriage Rumours | Sakshi
Sakshi News home page

పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి

May 26 2024 1:16 PM | Updated on May 26 2024 1:36 PM

Heroine Anjali Opens About Her Marriage Rumours

పెళ్లి రూమర్స్‌పై మరోసారి స్పందించిన అంజలి

తెలుగు బ్యూటీ అంజలి పెళ్లిపై చాలా రూమర్స్‌ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఓ తమిళ హీరోతో పెళ్లి అని పుకార్లు వచ్చాయి. దానిపై అంజలి వివరణ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి రూమర్స్‌ రాలేదు. మళ్లీ ఆమె సినిమాలతో బీజీ అయిన తర్వాత ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు త్వరలోనే సినిమాలకు పుల్‌స్టాప్‌ పెట్టి అమెరికాలో సెటిల్‌ అవుతుందనే ప్రచారమూ జరిగింది. అయితే వీటిని అంజలి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ఈ మ్యారేజ్‌ రూమర్స్‌ వస్తునే ఉన్నాయి. 

తాజాగా అంజలి తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందించింది. ‘ఇప్పటికే సోషల్‌ మీడియా నాకు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసింది(నవ్వూతూ..). మొదట్లో ఇలాంటి రూమర్స్‌ వస్తే ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్‌ అయ్యాననే పుకారు వచ్చింది. అమెరికాలోనే ఉన్న మా అక్క నాకు కాల్‌ చేసి..‘పెళ్లి అయిందటగా’ అని అడిగింది. ఏమో మరి నాకే తెలియదు అని చెప్పా(నవ్వుతూ..). నా పెళ్లిపై వచ్చిన రూమర్స్‌ కారణంగా..నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను.  పెళ్లి చేసుకుంటే.. పర్సనల్‌ లైఫ్‌కి కూడా టైమ్‌ కేటాయించాలి. అందుకే కొంచెం టైమ్‌ తీసుకొని పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను’ అని అంజలి చెప్పుకొచింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి మరో హీరోయిన్‌.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న విడుదల కాబోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement