సంక్రాంతి పోటీని తట్టుకునేందుకు 'హనుమాన్‌' ప్లాన్‌ అదుర్స్‌ | Sakshi
Sakshi News home page

సంక్రాంతి పోటీని తట్టుకునేందుకు 'హనుమాన్‌' ప్లాన్‌ అదుర్స్‌

Published Thu, Jan 4 2024 2:26 PM

Hanuman Movie Pre Release Chief Guest Is Chiranjeevi - Sakshi

ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. విడుదల తేదీలు దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్ కార్యక్రమాలకు చిత్ర యూనిట్స్‌ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు 'గుంటూరు కారం' ఈవెంట్‌ కోసం జనవరి 6వ తేదీని లాక్‌ చేసుకుంది. హైదరాబాద్‌లోని  యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున ఈ వేడుక జరగనుంది.  తాజాగా హనుమాన్ చిత్రం కూడా 7న ఎన్ కన్వెన్షన్ లో సెలబ్రేషన్‌కు రెడీ అవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నారు. ఇదే విషయాన్ని హీరో తేజ సజ్జ తెలిపాడు. హనుమాన్‌ కోసం గాడ్‌ఫాదర్‌ ఉన్నాడు అంటూ ఆయన తన ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేశాడు.

సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండటంతో సినిమాకు మరింత బజ్‌ క్రియేటే చేసేందుకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హనుమాన్‌ చిత్రంలో చిరంజీవి కూడా నటించారని వార్తలు వచ్చాయి. ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు అచ్చం చిరుని పోలి ఉన్నాయని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం ఈవెంట్‌ కోసం స్వయంగా ఆయనే రావడం చూస్తే ఏదో లింక్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. మెగాస్టార్‌కు హనుమంతుడు అంటే ఎనలేని భక్తి కాబట్టి ఇలాంటి చిత్రంలో ఆయన కొంతసేపు కనిపించడమో లేదా గొంతు వినిపించడమో ఉంటుందని భావిస్తున్నారు.

హనుమాన్‌ ప్లాన్‌ అదుర్స్‌
తేజ సజ్జ చైల్డ్‌ యాక్టర్‌ నుంచి హీరోగా ఎదిగాడు. ఇప్పటికే ఆయన పలు సినిమాలతో తనలో సత్తా ఉందని నిరూపించుకున్నాడు. అందుకు ఆయన నటన మీద నమ్మకంతో హనుమాన్‌ చిత్రాన్ని భారీ డడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై భారీగా బజ్‌ క్రియేట్‌ చేయడంలో ఆయన సక్సెస్‌ అయ్యాడు. ఇలాంటి సమయంలో సంక్రాంతి సినిమాల తాకిడిని ఈ ఫాంటసీ మూవీ ఎలా తట్టుకుంటుందాని. దాని కోసమే ఒక మంచి వ్యూహం సిద్ధం చేసినట్టు వినిపిస్తోంది.

గుంటూరు కారం, హనుమాన్‌ రెండు చిత్రాలు జనవరి 12న విడుదల కానున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి భారీగా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో హనుమాన్‌ సినిమాకు ఎర్లీ ప్రీమియర్లు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. అంటే  జనవరి 11న రాత్రే భారీగా షోలు ఉండేలా ప్లాన్‌ చేస్తుందట. ఇప్పటికే యూఎస్‌లో జనవరి 11 నుంచి  ప్రీమియర్స్‌ ఉన్నట్లు ప్రకటించింది. దీంతో కొంత వరకు కలెక్షన్స్‌ పెంచుకోవచ్చని హనుమాన్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. సినిమాకు హిట్‌ టాక్‌ వస్తే మరుసటి రోజు నుంచి కలెక్షన్స్‌ పెంచుకోవచ్చని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తుందట.

Advertisement
 
Advertisement