
టాలీవుడ్ హీరో గోపిచంద్- దర్శకుడు సంకల్ప్ రెడ్డి కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది. నేడు గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. #Gopichand33 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. చిట్టూరి శ్రీనివాస ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. భారతీయ చరిత్రలో అనేక కీలక ఘట్టాల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సంకల్ప్‌రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. చాలాగ్యాప్ తర్వాత ఆయన నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.