'పుష్ప 2' కాదు.. అసలు కథ ముందుంది! | Future Complications Of Allu Arjun After Pushpa 2 | Sakshi
Sakshi News home page

Allu Arjun Pushpa 2: 'పుష్ప 2' దెబ్బకు బన్నీపై మోయలేనంత భారం

Dec 10 2024 4:01 PM | Updated on Dec 10 2024 4:54 PM

Future Complications Of Allu Arjun After Pushpa 2

ఊహించిందే జరిగింది. రిలీజ్‌కి ముందు ఏర్పడ్డ అంచనాలకు తగ్గట్లే 'పుష్ప 2' హిట్ అయింది. ఐదు రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చేశాయని టాక్! దక్షిణాది కంటే ఉత్తరాదిలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పుష్ప పాత్రని నార్త్ ఆడియెన్స్ ఓన్ చేసేసుకున్నారు. ఎంతలా అంటే అల్లు అర్జున్ గురించి దేశమంతా మాట్లాడునేంత. ఇక్కడివరకు బాగానే ఉంది? కానీ వాట్ నెక్స్ట్?

(ఇదీ చదవండి: 'పుష్ప2'పై సిద్ధార్థ్‌ వ్యాఖ్యలు.. అల్లు అర్జున్స్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం)

ఎక్కడైనా సరే గుర్తింపు రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కొన్నిసార్లు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ముందు ఇలాంటి సవాలు ఉంది. ఎందుకంటే 'పుష్ప' అంటే ఇప్పుడు పేరు కాదు బ్రాండ్.

'పుష్ప' రిలీజ్ తర్వాత అల్లు అర్జున్.. ఉత్తరాది ప్రేక్షకులకు నచ్చేశాడు. ఇప్పుడు రెండో పార్ట్ తర్వాత ఇంకా నచ్చేశాడు. అయితే ఈ పాత్ర ఎఫెక్ట్.. బన్నీ కెరీర్‌పై చాలా ఉంటుంది. ఎంతలా అంటే ఇకపై ఏ సినిమా చేసినా సరే దీనితో పోల్చి చూస్తారు. హిట్టయిందా సరే లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. గతంలో ప్రభాస్ ఇలానే 'బాహుబలి'తో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. దీంతో తర్వాత చేసిన 'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాలకు డబ్బులైతే వచ్చాయి గానీ హిట్ అనిపించుకోలేకపోయాయి. ఎందుకంటే 'బాహుబలి' ఎఫెక్ట్ ఆ రేంజులో పడింది మరి.

(ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న 'పుష్ప'.. శ్రీవల్లి మిస్!)

అలా 'బాహుబలి' ప్రభావం చాలా ఏళ్లపాటు ప్రభాస్‌పై ఉండేది. 'సలార్', 'కల్కి' లాంటి వైవిధ్యమైన సినిమాలతో తనంటే 'బాహుబలి' మాత్రమే కాదు ఇంకా చాలా ఉందని ప్రూవ్ చేశాడు. అల్లు అర్జున్ కూడా 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. కానీ ఓవైపు ఈ సినిమాతో తనకు వచ్చిన పేరుని కాపాడుకుంటూనే.. డిఫరెంట్ మూవీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పుష్ప మూవీతో ఆడియెన్స్ అంత భారం వేసేశారు మరి!

మిగతా హీరోల సంగతేమో గానీ బన్నీకి మేనేజ్‌మెంట్ స్కిల్స్ గట్టిగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 'పుష్ప 2' కోసం దేశమంతా ఒక్కడే ప్రమోషన్ చేసి మరీ హైప్ వచ్చేలా చేశాడు. ఇకపై కూడా అంతకు మించి అనేలా ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. త్రివిక్రమ్‌తో త్వరలో ఓ పీరియాడికల్ మూవీ చేయబోతున్నాడు. భారతీయ సినీ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో దీనికి బడ్జెట్ ఉంటుందని, స్టోరీ కూడా అలాంటిదే అని హింట్స్ వచ్చాయి. మరి అది 'పుష్ప'ని మించి ఉండాలనే కోరుకుందాం!

(ఇదీ చదవండి: వాడెవడో చందనం దొంగ హీరో.. రాజేంద్రప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement