
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.
చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కలలే కలలే..’ అంటూ సాగే మెలోడీపాటని ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘లవ్‌లో ఉన్నవాళ్లు ఫీల్ అవ్వండి, లవ్‌లో లేని వాళ్లు ఊహించుకోండి.. మ్యాజికల్ మెలోడి వస్తోంది..’ అంటూ కిరణ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకి కెమెరా: సతీష్ రెడ్డి మాసం, సహ నిర్మాత: బాలాజీ గుట్ట.