ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ కన్నుమూత

Fight Master Judo KK Rathnam Passed Away - Sakshi

సీనియర్‌ ఫైట్‌మాస్టర్‌ జూడో కేకే రత్నం (92) వృద్ధాప్యం కారణంగా గురువారం తుది శ్వాస విడిచారు. 1930 ఆగస్టు 8న జన్మించిన జూడో రత్నం 1959లో తమిళ చిత్రం ‘తామరై కుళం’ ద్వారా నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. 1966లో ‘వల్లవన్‌ ఒరువన్‌’ చిత్రంతో ఫైట్‌మాస్టర్‌గా మారారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, జయశంకర్, రజనీకాంత్, కమల్‌హాసన్, విజయకాంత్‌ వంటి ప్రముఖ హీరోలకు ఫైట్‌మాస్టర్‌గా చేశారు. తమిళ,

తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 1500 చిత్రాలకుపైగా ఆయన ఫైట్‌ మాస్టర్‌గా చేశారు. సుందర్‌ సి. హీరోగా నటించిన ‘తలై నగరం’(2006) జూడో రత్నం నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి స్వగ్రామం గుడియాత్తంలో స్థిరపడ్డారాయన. ప్రస్తుతం ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌లుగా కొనసాగుతున్న జాగ్వార్‌ తంగం, సూపర్‌ సుబ్బరాయన్‌  వంటివారు జూడో రత్నం వద్ద పనిచేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top