
‘ది ఫ్యామిలీ మేన్’ వంటి సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సిరీస్‌లో దుల్కర్ ఓ లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
Dulquer Salmaan Starts Web Series: ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓటీటీ ఎంట్రీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మేన్’ వంటి సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సిరీస్‌లో దుల్కర్ ఓ లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రాజ్‌కుమార్ రావ్, ఆదర్శ్ గౌరవ్ ఇతర ప్రధాన తారాగణం. కామెడీ, సస్పెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్ రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది.
ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కీలక పాత్రలు చేసిన ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) త్వరలో స్ట్రీమిగ్ కానుంది. ఇటు తెలుగులో ‘లెఫ్టినెంట్ రామ్’గా స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తోన్న దుల్కర్ ప్రస్తుతం కరోనా పాజిటివ్‌తో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.