
పద్నాలుగో శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘ద్రౌపతి–2’. రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసూదన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మోహన్ .జి దర్శకుడు. నేతాజీ ప్రోడక్షన్స్ తరఫున చోళ చక్రవర్తి, జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
‘‘14వ శతాబ్దంలోనే మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించారు. రక్తంతో రాసిన చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. దక్షిణ భారత దేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంద మంగలాన్నిపాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం వంటి అంశాలు కీలకంగా ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది.