
ఈతరం నటీమణులు గ్లామర్‌నే నమ్ముకుంటున్నారనడంలో సందేహం లేదనిపిస్తోంది. తమ అందచందాలతో దర్శక, నిర్మాతలను ఆకర్షించడానికి నానా తంటాలు పడుతుంటారు. బికినీలు, చిన్నపాటి దుస్తుల్లో రకరకాల భంగిమల్లో అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఫొటోషూట్‌లు నిర్వహిస్తారు.
Divya Bharathi Bikini Photoshoot Pics Goes Viral: ఈతరం నటీమణులు గ్లామర్‌నే నమ్ముకుంటున్నారనడంలో సందేహం లేదనిపిస్తోంది. తమ అందచందాలతో దర్శక, నిర్మాతలను ఆకర్షించడానికి నానా తంటాలు పడుతుంటారు. బికినీలు, చిన్నపాటి దుస్తుల్లో రకరకాల భంగిమల్లో అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఫొటోషూట్‌లు నిర్వహిస్తారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నటి దివ్యభారతి సైతం ఇదే బాట పట్టింది.
జీవీ ప్రకాష్‌కుమార్ 'బ్యాచిలర్' చిత్రంతో నాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ రొమాన్స్ సన్నివేశాల్లో నటించి కుర్రకారును బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం సక్సెస్ కావడంతో మరిన్ని అవకాశాలను రాబట్టుకుంటోంది. ప్రస్తుతం నటుడు ముగెన్‌తో జతకట్టిన 'మదిల్‌మేల్ కాదల్' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. దీనికి అంజనా అలీఖాన్ దర్శకురాలు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై దివ్యభారతి చాలా అంశాలు పెట్టుకుందట.
'ఇస్క్' అనే మరో మలయాళ రీమేక్ చిత్రంలోనూ నటుడు కదీర్ జంటగా దివ్యభారతి నటిస్తోంది. కాగా మరిన్ని అవకాశాల కోసం అందాలను విరాజిమ్ముతూ ఫోజులిచ్చింది. ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. వీటి కోసం ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుంది. బికినీ అందాలతో ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.