దివ్య అగర్వాల్‌కి అభిమాని షాక్‌..

Divya Agarwal Angry On Her Fan Fake News - Sakshi

ముంబై: ప్రముఖ నటి దివ్య అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటు అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవల ఓ అభిమాని తాను లంగ్‌ క్యాన్సర్‌తో చనిపోతున్నట్లు దివ్య అగర్వాల్‌కి ట్వీట్‌ చేశారు. ​కాగా తన అభిమాని మరణించాడన్న వార్త జీర్ణించుకోలేక ఎన్నో గంటలు పాటు ఏడ్చానని తెలిపింది. తన అభిమాని నిజంగా చనిపోయాడని అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి తాను ప్రయత్నం చేశానని, కానీ గాసిప్‌ కోసమే తన అభిమాని మరణించినట్లు అబద్ధం చెప్పాడని తెలుసుకొని షాక్‌కు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది.

కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏ నటి అభిమానులైనా తీవ్రంగా స్పందిస్తారని, ఇలాంటి పరిస్థితులే స్టార్స్ సీరియస్‌గా రియాక్ట్‌ కావడానికి తోడ్పడతాయని తెలిపారు. ఫేక్‌ వార్త చెప్పిన తన అభిమాని గురించి స్పందిస్తూ.. ఎవరైనా తనను అభిమానించే వాళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటానని, నిరంతరం వారు సంతోషంతో పాటు సమాజంలో గౌరవంగా వ్యవహరించాలని అభిమానికి నటి సూచించింది. నిజంగా అభిమానించే వాళ్లను ఎప్పటికి మోసం చేయరాదని తన ఫ్యాన్‌కు దివ్య అగర్వాల్‌ సూచించింది. దివ్య అగర్వాల్‌ యాంకర్‌గా, మోడల్‌గా, రియాల్టీని షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top