నా పాత్రపైన 'పుష్ప 2' టీజర్.. తీరా సినిమా రిలీజయ్యేసరికి | Divi Vadthya About Pushpa 2 Movie Role And Disappointment | Sakshi
Sakshi News home page

Actress Divi: షూటింగ్ 20 రోజులు చేశా డబ్బింగ్ 10 రోజులు చెప్పా

Mar 20 2026 5:18 PM | Updated on Mar 20 2026 6:29 PM

Divi Vadthya About Pushpa 2 Movie Role And Disappointment

సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నటీనటుల్ని తీసుకుంటారు. వాళ్లతో బోలెడన్ని రోజులు పనిచేయించుకుంటారు. కానీ చివరకొచ్చేసరికి ఏమైనా జరగొచ్చు. దర్శకుడు లేదా హీరో అనుకున్న ఔట్‌పుట్ బయటకొస్తుంది. సినిమా రిలీజైన తర్వాత కొందరు నటీనటుల.. ఇలా ఎడిటింగ్‌లో తన పాత్రని తగ్గించడం లేదా తీసేయడం గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ దివి కూడా 'పుష్ప 2' విషయంలో తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది.

(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)

'నాకు చెప్పినప్పుడు చాలా పెద్ద రోల్. నా క్యారెక్టర్‌పైనే టీజరే వచ్చింది. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుందని నేను అలానే ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ సినిమా వచ్చే టైంకి అన్ని ఉండవు. నేను చాలా బ్యాడ్‌గా ఫీలయ్యాను. కానీ ఎవరు వింటారు? ఇప్పుడు మన బాధ ఎవరు పట్టించుకుంటారు? దాని నుంచి మూవ్ అయిపోవాల్సిందే. నా పది మంది ఫ్రెండ్స్‌ని థియేటర్‌కి తీసుకెళ్లా. షూటింగ్ 20 రోజులు చేస్తే డబ్బింగ్ 10 రోజులు చెప్పాను. చాలా బాగా చేశామని నాకు తెలుసు. కానీ సినిమా చూసిన తర్వాత షాకయ్యాను' అని నటి దివి చెప్పింది.

ఈ సినిమా నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు అందులో దివి పాత్రనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ టీజర్‌లో చూపించిన ఏ సీన్ కూడా సినిమాలో లేదు. కేవలం ఒకటి రెండు సన్నివేశాల్లో రిపోర్టింగ్ చెబుతున్నట్లు మాత్రమే దివి కనిపిస్తుంది. తనేం మోసపోయానని చెప్పలేదు గానీ ఇలా చేయడం మాత్రం తనని చాలా బాధపెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు)

Advertisement
 
Advertisement
Advertisement