దిశా పటానిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..? | Disha Patani Enter In Kollywood | Sakshi
Sakshi News home page

Disha Patani: దిశా పటానిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

Published Fri, Nov 24 2023 7:21 AM | Last Updated on Fri, Nov 24 2023 8:55 AM

Disha Patani Enter In Kollywood - Sakshi

బాలీవుడ్‌ బోల్డ్‌ అండ్‌ బ్యూటీస్‌లో దిశా పటానికి చోటు కచ్చితంగా ఉంటుంది. మూడు పదుల పరువాల భామ 8 ఏళ్ల నట జీవితంలో చాలా పేరే సంపాదించింది. మోడలింగ్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ ఉత్తరాది బ్యూటీ కథానాయకిగా పరిచయం అయ్యింది మాత్రం తెలుగు చిత్రం కావడం విశేషం. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దిశా పటాని ని లోఫర్‌ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం చేశారు. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.

2015లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి దశ తిరిగింది మాత్రం ఎంఎస్‌ ధోనీ. ది అన్‌ టోల్డ్‌ స్టోరీనే. ఆ తరువాత ఆమె జోరు తగ్గలేదు. బాలీవుడ్‌లో ప్రముఖ స్టార్స్‌ చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కట్టాయి. ఇక గ్లామర్‌ విషయంలో తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతుంది. డాన్స్‌లోనూ దిట్టే. ఇక ప్రతిభ అంటారా? అంతకు మించే. అందుకే తక్కువ కాలంలోనే తెలుగు, హిందీ, చైనీస్‌, తమిళంలో నటిగా చుట్టేసింది. చైనీస్‌ భాషలో వరల్డ్‌ సూపర్‌స్టార్‌ జాకీచాన్‌కు జంటగా కుంగ్‌ ఫూ. యోగా చిత్రంలో నటించి పాన్‌ వరల్డ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దిశా పటాని తాజాగా తన రూట్‌ మార్చి కోలీవుడ్‌లోనూ పాగా వేసింది. సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో విడుదల కానుంది. ఇక దిశా పటానిలోని మరో ప్రతిభ ఏమిటంటే ఇటీవల ఈమె క్యూన్‌ కరు ఫికర్‌ పేరుతో ఓ మ్యూజికల్‌ ఆల్భమ్‌కు దర్శకత్వం వహించడం, కాగా ఈ బ్యూటీ భవిష్యత్తులో ప్యూచర్‌ ఫిలింకు దర్శకత్వం వహిస్తుందేమో చూడాలి. కాగా ఈమె తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే తన గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలకు 8 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారట. ఈ విషయంలో ఫటా ఫట్‌ అంటూ దూసుకెళ్తోంది దిశ పటాని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement