విజయ్‌ని, అతడి పార్టీని విమర్శించను.. ఎందుకంటే? | Director Sundar C Said Not Criticise Vijay Thalapathy | Sakshi
Sakshi News home page

Vijay Thalapathy: విజయ్‌ని నా భార్య అలా భావిస్తుంది.. అందుకే

Apr 1 2026 9:13 PM | Updated on Apr 2 2026 9:42 AM

Director Sundar C Said Not Criticise Vijay Thalapathy

తమిళనాడులో ప్రస్తుతం హడావుడి నెలకొంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల మనసు గెలుచుకుని అధికారం దక్కించుకునేందుకు బోలెడన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. హీరో దళపతి విజయ్ కూడా టీవీకే పార్టీ తరఫున బరిలో నిలిచాడు. మరోవైపు తమిళ దర్శకుడు సుందర్.సి కూడా ఇదే ఎలెక్షన్స్‌లో మధురై సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. తాను బరిలో ఉన్నప్పటికీ విజయ్‌ని, అతడి పార్టీని విమర్శించనని చెబుతూ అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)

హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన సుందర్.. తమ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉందని, తన భార్య ఖుష్బూ.. విజయ్‌ని తమ్ముడిలా భావిస్తుందని అందుకే విజయ్ లేదా అతడి పార్టీపై విమర్శలు చేయనని స్పష్టం చేశాడు. ఇప్పటివరకు సినిమాలతో ప్రేక్షకులని అలరించిన తాను.. రాజకీయాల్లో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నానని అన్నాడు. తన సినీ ప్రయాణంలో ఎలా ఆదరించారో, ఇక్కడ కూడా అలాగే మద్ధతు ఇవ్వాలని ప్రజలని కోరాడు.

ఎన్డీఏ కూటమిలో భాగంగా సుందర్.. పుతియ నీది కచ్చి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే మధురై సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఏఐఏడీఎంకే, డీఎంకే మధ్యనే ఉంటుందని.. ఇక్కడ విజయ్ పార్టీ ప్రభావం తక్కువగా ఉంటుందని సుందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'గ్యాంగర్స్' సినిమాలో నటించి దర్శకత్వం వహించిన సుందర్, ప్రస్తుతం విశాల్ హీరోగా 'మగాడు' అనే మూవీ చేస్తున్నారు. నయనతారతో 'ముక్తి అమ్మన్ 2' కూడా తీస్తున్నారు.

(ఇదీ చదవండి: 'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్)

Advertisement
 
Advertisement
Advertisement